SRD: సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామంలో తడి, పొడి చెత్తపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ హనుమంతరావు, ఉప సర్పంచ్ విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, మెరుగు పట్ల గ్రామస్తులకు పంచాయతీ కార్యదర్శి సాయిలు సూచనలు ఇచ్చారు. గ్రామ స్వచ్ఛత కోసం ప్రజలందరూ సహకరించాలని కోరారు.