AP: మొంథా తుఫాన్ నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఈ మేరకు తుఫాన్ పరిస్థితిపై ఆరా తీశారు. పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి సాయం ఉంటుందని భరోసా కల్పించారు. కాగా, మొంథా తుఫాన్ ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల వల్ల ప్రభుత్వం అలర్ట్ అయింది. ముందస్తు చర్యలను చేపట్టిన విషయం తెలిసిందే.