W.G: జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్థానిక బైపాస్ బుట్టాయిగూడెం రోడ్డులో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని ఇవాళ ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అల్లూరి పోరాటపటిమను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.