ప్రకాశం: టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో ఉన్న జియో బీపీ పెట్రోలు బంకుపై 6ఏ కేసు నమోదు చేసినట్లు తహసీల్దార్ ఆంజనేయులు ఆదివారం తెలిపారు. ఈ బంకులో పెట్రోలు కొట్టించుకున్న వాహనదారులు కొంత దూరం వెళ్లిన తర్వాత వాహనం ఆగిపోతోందని, తమకు ఫిర్యాదు చేయడంతో అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. పెట్రోల్లో నీరు కలిసిందని గుర్తించి కేసు నమోదు చేసామన్నారు.