నేచురల్ స్టార్ నానికి జోడీగా పూజా హెగ్డే నటించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సుజీత్తో నాని ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో పూజ కథానాయికగా చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమెతో మేకర్స్ సంప్రదింపులు జరిపారట. ఇక నిహారిక ఎంటర్టైన్మెంట్, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందనుంది.