JGL: మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధిపై ఎమ్మెల్యే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ఎమ్మెల్యేలు, ప్రభుత్వంపై ఉందని ఆమె అన్నారు. ఆ బాధ్యతను విస్మరించడం సరికాదని సారంగాపూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.