NLG: జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో సుదీర్ఘ కాలంగా ఒకేచోట పని చేస్తున్న అధికారులను బదిలీ చేయడంలో జాప్యం జరుగుతుందని ప్రజా సంఘాలు, ప్రజలు అనుకుంటున్నారు. డిప్యూటేషన్ల పేరుతో చాలా సంవత్సరాలుగా ఒకచోట పనిచేయడం వల్ల అవినీతికి ఆస్కారం ఉంటుందని ఆరోపిస్తున్నారు. ఏండ్ల తరబడి ఒకే చోట పని చేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.