ATP: కళ్యాణదుర్గం మండలం తూర్పు కోడిపల్లిలో మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణను ఆదివారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. వాల్మీకి సోదర, సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.