Imran Khan:పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భూ కబ్జా కేసులో షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 2 వారాల మధ్యంతర బెయిల్‌ను ధర్యాసనం మంజూరు చేసింది. దీంతోపాటు అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. అతనిపై ఇప్పటివరకు 201 కేసులు ఉండగా.. మే 17వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీచేసింది. దీంతో ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట కలిగింది.
ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి విడుదల వెంటనే అరెస్ట్ చేసేందుకు పాకిస్థాన్ పోలీసులు సిద్దంగా ఉండగా.. హైకోర్టు ఆదేశాలతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. వివిధ కేసుల్లో ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్‌పై 10కి పైగా అరెస్ట్ వారెంట్స్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇమ్రాన్ బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ మియాంగుల్ హసన్ ఔరంగజేబ్, జస్టిస్ సమాన్ రఫాత్ ఇంతియాజ్‌తో డివిజన్ బెంచ్ విచారణ జరిపింది.
భూ కబ్జా కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఇటీవల ఇస్లామాబాద్ వచ్చిన ఇమ్రాన్ ఖాన్‌ను హైకోర్టు ప్రాంగణంలో అరెస్ట్ చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దీంతో సుప్రీంకోర్టు కలుగజేసుకుంది. కోర్టు ప్రాంగణంలోకి 90 మంది ప్రవేశిస్తే కోర్టు గౌరవం ఎక్కడ ఉంది అని సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగింది. ఏ వ్యక్తిని అయినా సరే కోర్టు ప్రాంగణం నుంచి అరెస్ట్ చేయొచ్చా అని చీఫ్ జస్టిస్ అడిగారట. ఇదివరకు కోర్టు లోపల విధ్వంసం చేసిన లాయర్లపై చర్యలు తీసుకున్నామని పేర్కొంది. ఓ వ్యక్తి కోర్టు ఎదుట లొంగిపోయిన తర్వాత.. అరెస్ట్ చేయడం దేనికి సంకేతం అని అడిగింది.