GNTR: గుంటూరులో ఆదివారం కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. శ్రీరామ్ నగర్, చుట్టుగుంట వంటి ప్రాంతాల్లో 30 గుడ్ల ట్రే కేవలం రూ. 140లకే లభిస్తుండటంతో వినియోగదారులు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇతర ధరల విషయానికొస్తే.. చికెన్ స్కిన్లెస్ కేజీ రూ. 250, మటన్ కేజీ రూ. 1000గా ఉంది. చేపల్లో బొచ్చ కేజీ రూ. 230, కొరమేను రూ. 430కి విక్రయిస్తున్నారు.