»Vikram Aishwarya Rai Upcoming Movie In Maniratnam Direction
Aishwarya Rai: విక్రమ్, ఐశ్వర్య కాంబోలో మరో సినిమా!
త్వరలోనే పొన్నియన్ సెల్వన్ హిట్ పేర్ రిపీట్ కానుంది. భారత దర్శక మణిమకుటం మణిరత్నం దర్శకత్వంలోనే ఈ సినిమా రానుంది. మరోసారి విక్రమ్ ఐశ్వర్య కాబినేషన్ ప్రేక్షకులను అలరించనుంది.
పొన్నియన్ సెల్వన్ హిట్ కాంబినేషన్ మరో మారు సినీ ప్రేమికులను అలరించనుంది. మణిరత్నం దర్శకత్వంలో పీఎస్ 1, పీఎస్ 2 , భారీతారాగణంతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను చోల రాజ్యానికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. పీఎస్ లో ప్రతీ క్యారెక్టర్ కు ఎంత విలువ ఇవ్వాలో ఎంత స్కోప్ ఉండాలో తూకం తూచినట్లు న్యాయం చేశారు మణిరత్నం. విక్రమ్(vikram) – ఐశ్వర్య రాయ్(aishwarya rai), కార్తి – త్రిష, జయం రవి – శోభితా దూళిపాళ్ల కాంబినేషన్లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. వీరితో పాటు ముఖ్య తారాగణమైన శరత్ కుమార్, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్, ప్రభు వంటి ప్రముఖ తారాలతో చిత్రీకరించబడిన పొన్నియన్ సెల్వన్ సీక్వెల్స్ విజవంతంగా నిలిచాయి. మణిరత్నం మణిమకుటంలో పీఎస్ సీక్వెల్స్ అందగా పొదగబడ్డాయి.
పొన్నియన్ సెల్వన్ లో ముఖ్యంగా ఆధిత్య కరికాల – నందినిగా నటించిన విక్రమ్ – ఐశ్వర్యరాయ్ ల జంట ఎంతగానో ఆకట్టుకుంది. అందుకు మణిరత్నం(mani ratnam) దర్శకత్వం తోడైంది. గతంలో రావణ్ అనే సినిమాలో కూడా విక్రమ్ – ఐశ్వర్యరాయ్ ల కాంబినేషన్ ఎంతగానో అలరించింది. వీరి స్క్రీన్ అప్పియరెన్స్ కూడా ఎంతో బాగుంటుందనడంలో సందేహం లేదు. దాంతో పాటే విక్రమ్ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ తాను ఐశ్వర్యరాయ్ తో నటించాలని తన కెరీర్ మొదట్లో ఎంతో ఆశ ఉండేదని చెప్పారు. అలాంటిది.. ఇప్పుడు విక్రమ్ ఐశ్వర్యరాయ్ ల కాంబినేషన్ హిట్ ఫెయిర్ అయింది.
తాజాగా కమల్ హసన్ కథానాయకుడిగా మణిరత్నం(mani ratnam) ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత మరో క్రేజీ కాంబినేషన్ లో మరో చిత్రానికి మణిరత్నం సిద్దమవుతున్నారు. అదే పొన్నియన్ సెల్వన్ కాంబినేషన్. ఇందులో విక్రమ్ ఐశ్వర్యరాయ్ హీరో హీరోయిన్లుగా చేయనున్నట్లు తెలుస్తోంది. వీరి కాంబినేషన్ లో రావణ్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అందులో కూడా ఇద్దరుపోటీ పడి తమ క్యారెక్టర్ ను పండించారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.