KKD: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో A2గా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈనెల 5న ఆమెపై రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. దీంతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. డ్రైవర్ హత్య కేసులో దర్యాప్తు చేసిన సిట్.. కోర్టులో అనుబంధ చార్జ్ షీట్లు దాఖలు చేసిన నేపథ్యంలో వారెంట్ జారీ అయినట్లు సమచారం