»Vijay Devarakonda Kushi Movie Na Roja Nuvve Song In World Top Five Best Albums List
World top five: బెస్ట్ ఆల్బమ్స్ లిస్టులో ఖుషీ మూవీ సాంగ్
విజయ్ దేవరకొండ(vijay devarakonda), సమంత(samantha) నటించిన ఖుషి మూవీ నుంచి విడుదలైన నా రోజా నువ్వే(na roja nuvve) పాటకు మంచి స్పందన లభిస్తోంది. యూటూబ్లో 15 మిలియన్ల వ్యూస్ తో కొనసాగుతుంది. మరోవైపు ఈ పాట మరోఅరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda) బర్త్ డే స్పెషల్ గా ఖుషీ మూవీ(Kushi movie) నుంచి విడుదల చేసిన నా రోజా నువ్వే అనే పాట యూట్యూబ్లో దూసుకెళ్తుంది. దాదాపు 15 మిలియన్ వ్యూస్ తో పాటు లక్ష లైక్స్ తో ఈ పాట వరల్డ్ బెస్ట్ ఆడియో చార్ట్ బస్టర్స్ లో ఐదో స్థానాన్నిసొంతం చేసుకుని సత్తా చాటింది.
తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ పాట అన్ని భాషల నుంచీ అద్భుతమైన స్పందన సొంతం చేసుకుంది. హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచి ఈ పాటను తనే పాడాడు. ఈ గీతాన్ని దర్శకుడు శివ నిర్వాణ(shiva nirvana) రాయడం ఓ విశేషమైతే.. ” నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే” అంటూ పాట మొత్తంలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాల పేర్లు కలిసి వచ్చేలా సాహిత్యం ఉండటం మరో విశేషం.
‘నా కడలి కెరటంలో ఓ మౌనరాగం నువ్వేలే.. నీ అమృపు జడిలో ఓ ఘర్షణే మొదలైంది.. “, నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అనుపల్లవిగా.. నీ గుండె సడి లయలో.. నే మారనా నీ ప్రతిధ్వనిగా.. ” అంటూ మంచి సాహిత్యం కూడా ఈ పాటలో కనిపిస్తోంది. ఈ సాహిత్యం అన్ని భాషల నుంచీ అద్భుతంగా కన్వే కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఆడియన్స్ ఖుషీ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ ను తమ ది బెస్ట్ ఆల్బమ్స్ లిస్ట్ లో పెట్టుకున్నారు.
సినిమా థీమ్ ను తెలియజేస్తూనే అద్భుతమైన ఫీల్ నూ ఇస్తోన్న ఈ పాట ప్రపంచవ్యాప్తంగా(worldwide) ఉన్న ది బెస్ట్ సాంగ్స్ లో ఐదవ స్థానంలో నిలవడం.. మూవీ బ్లాక్ బస్టర్ కు ఊతం ఇస్తుందనే చెప్పాలి. ఫస్ట్ సాంగ్ తోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసిన ఖుషీ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషలతో పాటు హిందీలోనూ సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నారు.
ఇది కూడా చూడండి:Aparna Das: తెలుగు తెరకు మరో టాలెంటెడ్ బ్యూటీ..!