MDK: మెదక్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ అమరవీరుల దినం (ఫ్లాగ్ డే) వారోత్సవాల్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం చేపట్టారు. అదనపు ఎస్పీ మహేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినీలు, గీత స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు పోలీసులు వినియోగించే ఆయుధాలు, సాంకేతిక పరికరాలు, ఆయుధాల వినియోగ పద్ధతులు వివరించారు.