ఖమ్మం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం వేళ భానుడు దర్శనం ఇవ్వగా.. మధ్యాహ్నం ఒక్కసారిగా మెగావృతమై కుండపోత వర్షం కురిసింది. ఖమ్మం రూరల్, రఘునాధపాలెం, ఖమ్మం నగరం, వైరా, కొణిజర్ల తదితర మండలాల్లో భారీ వర్షం పడింది. ఈ భారీ వర్షంతో జనజీవనం కొంతసేపు స్తంభించింది. అటు పత్తి, పెసర, వరి పంటలు ఈ వర్షానికి పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది.