KMR: ప్రతిరోజు యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మండల ఆయుష్ యోగ శిక్షకులు ప్రశాంత్, సంధ్య చెప్పారు. నేడు బిక్నూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు, ఇతర రోగులకు యోగపై అవగాహన కల్పించారు. ప్రతిరోజు గంటపాటు యోగాసనాలు చేస్తే ఆరోగ్యంగా ఉంటారని, గర్భిణులు క్రమం తప్పకుండా యోగాసనాలు చేస్తే సుఖ ప్రసవాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.