కర్ణాటక ఎన్నికలు(Karnataka Elections) ముగిశాయి. ఈ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్(Exit Polls) సంచలనం రేకెత్తిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా చూస్తే కాంగ్రెస్‌కు 107 నుంచి 119 సీట్లు మాత్రమే రావచ్చని తేల్చింది. అలాగే బీజేపీకి 78 నుంచి 80 మధ్య సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. జేడీఎస్‌కు 23 నుంచి 29 వరకూ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఇతరులకు 4 సీట్లు లోపు అవకాశం రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి.
ఇప్పటి వరకూ కూడా విడుదలైన అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో అధిక శాతం కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లు చెబుతున్నాయి. జనతాదళ్ సెక్యులర్ నేత హెడీ కుమారస్వామి కింగ్ మేకర్ పాత్ర పోషించనున్నారు. మొత్తం 224 సీట్లు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో గెలవడానికి మ్యాజిక్ ఫిగర్ 113గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు: పీపుల్స్ పల్స్ : కాంగ్రెస్ 107 -119, బీజేపీ 78-80,జేడీఎస్ 23-29 ఓట్ షేర్: కాంగ్రెస్ 42 శాతం , బీజేపీ 36 శాతం, జేడీఎస్ 16 శాతం
జీ న్యూస్-మ్యాట్రిజ్: కాంగ్రెస్ 103-118, బీజేపీ 79-94, జేడీఎస్ 25-33, ఇతరులు 2-5 టీవీ9 భరత్‌వర్ష్-పోల్‌స్ట్రాట్: కాంగ్రెస్ 99-109, బీజేపీ 88-98, జేడీఎస్ 21-26, ఇతరులు 0-4 ఏబీపీ-సీఓటర్: బీజేపీ 66-86, కాంగ్రెస్ 81-101, జేడీఎస్ 20-27, ఇతరులు 0-3 పోల్ ఆఫ్ పోల్స్: కాంగ్రెస్ 103, బీజేపీ 94
న్యూస్ నేషన్-సీజీఎస్: కాంగ్రెస్-86, బీజేపీ-114, జేడీఎస్-21, ఇతరులు-3 సువర్ణ న్యూస్-జన్ కీ బాత్: కాంగ్రెస్ 91-106, బీజేపీ 94-117, జేడీఎస్ 14-24, ఇతరులు 0-2 రిపబ్లిక్ టీవీ-పీ మార్క్యూ: కాంగ్రెస్ 94-108, బీజేపీ 85-100, జేడీఎస్ 24-32, ఇతరులు 2-6