TPT: తిరుపతిలో పోలీసులు నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో నకిలీ మద్యం బయటపడింది. శేషాద్రి నగర్లో గంజాయి సేవిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. పాడిపేట ఇందిరమ్మ గృహాల్లో నకిలీ మద్యం తయారు చేస్తున్న వారిని తిరుచానూరు పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడుల్లో DSP బేతపూడి ప్రసాద్, సీఐలు, ఎస్సై పాల్గొన్నారు.