కోనసీమ: అంబాజీపేట జడ్పీ హైస్కూల్లో మహిళా దినోత్సవంలో భాగంగా శనివారం తైక్వాండో సీనియర్ కోచ్ త్రిమూర్తుల అధ్యక్షతన విద్యార్థినిలకు సెల్ఫ్ డిఫెన్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ.. మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. మహిళా భద్రతకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు.