TG: మున్సిపల్ కమిషనర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ను క్లీన్ సిటీగా మార్చాలని అధికారులకు సూచించారు. ప్రతిరోజు చెత్త సేకరణ జరగాల్సిందేనని ఆదేశించారు. క్యూర్ పరిధిలో EV వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. కొత్త డంపింగ్ యార్డులు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు.