SDPT: వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని DMHO ధనరాజ్ ఆదేశించారు. చిన్నకోడూర్ మండలం ఇబ్రహీంనగర్ పీహెచ్సీలో నిర్వహిస్తున్న ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక వైద్య శిబిరాన్ని శనివారం సందర్శించి ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. వైద్య శిబిరానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.