కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఆర్సీ 15 ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఇటీవలె ఈ సినిమాకు గ్లోబల్ టచ్ ఇస్తూ 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. తాజాగా గేమ్ ఛేంజర్ నుంచి అదిరిపోయే అప్టేడ్ ఇచ్చాడు డైరెక్టర్ శంకర్.
టాలీవుడ్(Tollywood) ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు(Dil Raju) ‘గేమ్ ఛేంజర్’ మూవీ(Game Changer Movie)ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా.. సునీల్, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం జరుపుకుంది. మధ్యలోకి కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ రావడంతో.. చరణ్ సినిమా కాస్త డిలే అవుతోంది. నెలలో 12 రోజుల లెక్కన రెండు సినిమాల షూటింగ్ చేస్తున్నాడు శంకర్(Director shankar). తాజాగా గేమ్ చేంజర్ సినిమా క్లైమాక్స్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఎలక్ట్రిఫైయింగ్ క్లైమాక్స్ కంప్లీట్ అయ్యింది.. అంటూ ట్వీట్ చేశాడు శంకర్. దాంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది ‘గేమ్ ఛేంజర్'(Game Changer Movie). ఈ సినిమా క్లైమాక్స్‌ను దాదాపు వెయ్యి మంది ఫైటర్లతో భారీగా తెరకెక్కించాడు శంకర్. కెజియఫ్ ఫైట్ మాస్టర్స్ అన్బరివ్‌లు ఈ ఫైట్ కంపోజ్ చేశారు. ఇక ఇప్పుడు శంకర్ ఎలక్ట్రిఫైయింగ్ క్లైమాక్స్ అని చెప్పడంతో.. అంచనాలు పెరిగిపోతున్నాయి. ఖచ్చితంగా గేమ్ ఛేంజర్ యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్లో ఉంటాయిని అంటున్నారు.
ఇక గేమ్ ఛేంజర్(Game Changer Movie) ఓ షెడ్యూల్ అయిపోవడంతో.. వెంటనే ఇండియన్ 2 షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆ విషయాన్ని కూడా శంకర్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఇండియన్ 2 సినిమాకి సంబంధించిన సిల్వర్ బుల్లెట్ సీక్వెన్స్‌ని షూట్ చెయ్యబోతున్నట్టు చెప్పాడు. ఇకపోతే.. గేమ్ ఛేంజర్ అయిపోయిన వెంటనే బుచ్చి బాబు సానాతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు రామ్ చరణ్. వచ్చే సంక్రాంతి లేదా సమ్మర్లో గేమ్ ఛేంజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అందుకే.. కుదిరితే ఈ ఏడాదిలో ఎండింగ్‌లోనే ఆర్సీ 16ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.