సత్యసాయి: గోరంట్ల మేజర్ పంచాయతీ పరిధిలో రాజీవ్ కాలనీలో టీడీపీ కార్యకర్త శ్రీనివాసులు భార్య నందిని అనారోగ్యంతో బుధవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న గోరంట్ల టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి వారి ఇంటికి వెళ్ళి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరేష్, తదితరులు పాల్గొన్నారు.