AP: దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో YCP MLC అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు SC, ST కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సుప్రీం ఆదేశాలతో ఈ కేసులో ఆమెను ఏ-2 నిందితురాలిగా చేర్చిన సిట్ అధికారులు, ఇటీవల అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా వారెంట్ జారీ చేయడంతో, లక్ష్మీదుర్గ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.