VSP; ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నెలలో ఒకరోజు గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీ సీఈవో నారాయణమూర్తి తెలిపారు. ఏపీ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం సమావేశం శనివారం విశాఖలో జరిగింది. ఉద్యోగుల సంఘాలు పటిష్టంగా ఉన్నప్పుడే సమస్యలను సాధించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.