ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం.. ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 17న రిలీజ్ అయిన పుష్ప పార్ట్ వన్.. పాన్ ఇండియా స్థాయిలో దుమ్ములేపింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులరిటీని సొంతం చేసుకుంది. అందుకే ఇప్పుడు రష్యన్ భాషలోను రిలీజ్ చేయబోతున్నారు.
తాజాగా వచ్చే నెల.. అంటే డిసెంబర్ 8న, రష్యాలో ‘పుష్ప: ది రైజ్’ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 1న మాస్కో మరియు డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్ బర్గ్‌లో.. గ్రాండ్‌గా ప్రీమియర్స్ నిర్వహించనున్నారు. ఈ ప్రీమియర్ మరియు అక్కడ ప్రమోషన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ రష్యా వెళ్లనుంది. బన్నీ-సుకుమార్ కూడా రష్యా ఫ్లైట్ ఎక్కనున్నారు. దాంతో పుష్ప2 పై మరింత హైప్ రానుందని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు..
పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలె పూజాకార్యక్రమాలు జరుపుకున్న పుష్ప2.. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కూడా మొదలైనట్టు సమాచారం. కానీ మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు బన్నీ-సుకుమార్.. రష్యా టూర్లో పుష్ప2 షూటింగ్ అప్టేట్ ఇవ్వడం పక్కా అని చెప్పొచ్చు. అలాగే ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ గురించి..
మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెల్స్ తెలియనున్నాయి. ఇకపోతే.. పుష్ప2ని అంతకు మించి అనేలా తెరకెక్కించబోతున్నాడు సుకుమార్. అందుకోసం దాదాపు 350 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. మరి పుష్ప2 ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.