MHBD: కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ స్నేహ శబరిష్‌ను డీసీసీ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్‌కు పూల మొక్కను అందజేశారు. అనంతరం జిల్లాలోని పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై కలెక్టర్‌తో చర్చించినట్లు పేర్కొన్నారు.