నెల్లూరు నగరంలోని జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి సోమవారం దీపావళి వేడుకలు జరుపుకున్నారు. పార్టీ కార్యాలయంను దీపాలతో అలంకరించి, అందరూ టపాసులు కాల్చారు. పార్టీలో విభేదాలు తలెత్తి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన తరుణంలో అందరూ కలిసి ఈ వేడుకలు జరుపుకోవడంతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది.