VKB: వికారాబాద్లో సోమవారం ఉదయం ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా, మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణం చల్లబడినప్పటికీ, దీపావళి సందర్భంగా టపాసులు, పూలు అమ్ముకునే వ్యాపారులు వర్షానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణ శాఖ ముందస్తుగానే భారీ వర్ష సూచన వెల్లడించింది.