ATP: పామిడిలో సోమవారం జరిగిన కోటి సంతకాల ప్రజాఉద్యమం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమైందన్నారు. ఈ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో పాల్గొని తమ మద్దతును తెలపాలన్నారు.