»Jaganannaku Chebudam Programme Launched Cm Ys Jagan
AP: జగనన్నకు చెబుదాం ప్రారంభం.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: సీఎం జగన్
ప్రతి మంచి పనికి కూడా మాకు ఎంత ఇస్తారనే గుణం ప్రతిపక్షాలది. టీడీపీ (TDP) హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవు. వారి పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చేవారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ‘జగనన్నకు చెబుదాం’ అనే కార్యక్రమం చేపట్టినట్లు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan) తెలిపాడు. ప్రజలకు సేవ చేసేందుకు 1902 టోల్ ఫ్రీని (Toll Free) ప్రారంభించారు. తాడేపల్లిలోని (Tadepalli) తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలు (Govt Services) ‘జగనన్నకు చెబుదాం’తో అందిస్తామని పేర్కొన్నాడు.
ఈ కార్యక్రమంలో గత ప్రభుత్వంపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ‘ప్రతి సమస్యకు పరిష్కారం వెతికే దిశగా పాలన సాగుతోంది. ప్రతి మంచి పనికి కూడా మాకు ఎంత ఇస్తారనే గుణం ప్రతిపక్షాలది. టీడీపీ (TDP) హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవు. వారి పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చేవారు. గత ప్రభుత్వ పాలనలో అడుగడుగునా వివక్ష ఉండేది. నా పాదయాత్రలో ప్రజల సమస్యలను (Problems) నేరుగా గమనించా. పార్టీలకు అతీతంగా ప్రజలకు పథకాలు అందించాలి. వ్యవస్థలో (System) మార్పు తీసుకువచ్చేందుకు ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’ అని సీఎం జగన్ వివరించాడు.