ప్రకాశం: గిద్దలూరు పట్టణం కసెట్టి వారి వీధిలో(10వ వార్డు) వారం రోజుల నుంచి చెత్తా చెదారం రోడ్లపైనే పడి వేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల ఆ ప్రాంతం గుండా వెళ్లాలంటే దుర్గంధ వాసన వస్తుంది. దోమల ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంది. ప్రజలు రోగాల బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి ఆ ప్రాంతంలో చెత్తా చెదారం తొలగించాలని స్థానికులు తెలిపారు.