TG: బీసీ నేతల బంద్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన పార్టీల్లో ఉన్న బీసీ నేతలంతా పదవులు అనుభవిస్తూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. బీసీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే, ముందుగా తమ పదవులకు రాజీనామా చేసి మాట్లాడాలని డిమాండ్ చేశారు. బీసీ నేతలు అగ్రవర్ణ పార్టీలకు అమ్ముడుపోయి ధర్నాలకు బీసీ సంఘాలకు పిలుస్తారని దుయ్యబట్టారు.