AP: కర్నూలు శివారు నన్నూరుకు కాసేపట్లో ప్రధాని మోదీ చేరుకోనున్నారు. సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ సభలో ఆయన పాల్గొననున్నారు. ప్రధానితో పాటు సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఇతర నేతలు పాల్గొననున్నారు. సభా ప్రాంగణంలోనే టెంట్ల మధ్యలో నిర్మించిన రహదారిపైనే మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. వాహనం పైనుంచి ప్రజలకు అభివాదం చేయనున్నారు.