ASR: గిరిజన ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కోసం ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని సీపీఎం అరకు మండల కార్యదర్శి కిండంగి రామారావు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం బస్కి పంచాయతీలో పలువురు గిరిజనులతో కలిసి నిరసన తెలిపారు. గిరిజన ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం అంటే గిరిజన చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు.