KNR: జమ్మికుంట మండల కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అధ్యక్షతన మెప్మా ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం జరిగింది. మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమవుతున్నాయని, ఈ చెడు ప్రభావాలపై అవగాహన అవసరమని, మాదకద్రవ్య రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని కమిషనర్ తెలిపారు.