కృష్ణా: పొన్నవరంలోని ఏకత్వ పాఠశాలలో అండర్ -14 బాల, బాలికల జిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపికలను గురువారం సాయంత్రం 3 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా ఫెన్సింగ్ సంఘ కార్యదర్శి నాగం సతీశ్ బాబు తెలిపారు. ఈ పోటీలకు 01/01/ 2012 తరువాత జన్మించిన క్రీడాకారులు (ఫెన్సర్స్), ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి గుర్తింపు కార్డును కలిగి ఉండాలన్నారు.