ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రంలో 1345 బేళ్లు అమ్మకానికి తీసుకురాగా 903 బేళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. 442 బేళ్లు వివిధ కారణాలతో తిరస్కరించారు. పొగాకు అమ్మకానికి ఎన్. ఎన్ కండ్రిక, పెట్లూరు గ్రామాలకు చెందిన రైతులు వేలానికి పొగాకు తీసుకువచ్చారు. బోర్డు గత నెలలోనే కొనుగోళ్లు పూర్తి అవ్వాల్సి ఉండగా ఇప్పటికీ తిరస్కరణ చేస్తుండడంతో వేలం కొనసాగుతుంది.