HNK: జిల్లా కేంద్రంలో బుధవారం CM రేవంత్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో CM రేవంత్ రెడ్డిని, కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి, TPCC ఓబీసీ కోఆర్డినేటర్ తౌటం రవీందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంను శాలువాతో సత్కరించి, పూల మొక్క అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు.