Sharad Pawar takes back decision to quit as NCP chief
Sharad Pawar:ఎన్సీపీ అధ్యక్ష పదవీ రాజీనామా చేసి పార్టీలో ప్రకంపనలు రేపారు కురువృద్ద రాజకీయ నేత శరద్ పవార్ (Sharad Pawar). రాజీనామాతో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు చేయగా.. రాజీనామా విత్ డ్రా చేసుకోవాలని ముక్తకంఠంతో అభిప్రాయం తెలియజేశారు. దీంతో శరద్ పవార్ (Sharad Pawar) తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు.
‘అధ్యక్ష పదవీకి రాజీనామా చేసిన తర్వాత జరిగిన పరిణామాలను గమనించాను. కార్యకర్తలు, ప్రజల్లో అశాంతి చెలరేగింది. రాజీనామా నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని తన సలహాదారులు సూచనలు ఇచ్చారు. రాజీనామా నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మద్దతుదారులు, రాజకీయ నేతలు కోరారు. వారందరీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని.. తిరిగి పార్టీ అధ్యక్ష పదవీ చేపట్టాలి’ అని నిర్ణయం తీసుకున్నానని శరద్ పవార్ (Sharad Pawar) తెలిపారు.
1999లో పార్టీ ఏర్పాటు చేశానని.. అప్పటినుంచి తానే అధ్యక్షుడిగా ఉన్నానని శరద్ పవార్ (Sharad Pawar) తెలిపారు. అధినేత మార్పుపై ఆలోచించి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. పవార్ రాజీనామా తర్వాత అజిత్ పవార్, సుప్రియ సూలే, ప్రఫుల్ పటేల్, చగన్ భుజ్ బల్తో కమిటీ ఏర్పాటు చేయగా.. పవార్ (Sharad Pawar) రాజీనామాను కమిటీ తోసిపుచ్చింది. కమిటీ ఏకగ్రీవంగా తిరస్కరించి.. తిరిగి పార్టీ అధ్యక్ష పదవీ చేపట్టాలని కోరింది.
పవార్ అల్లుడు అజిత్ పవార్.. బీజేపీతో స్నేహాం చేస్తున్నారని.. పార్టీలో చేరతారని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో శరద్ పవార్ రాజీనామాస్త్రం ప్రయోగించారు. తన ప్రయాణం ఎన్సీపీతోనే అని అజిత్ పవార్ స్పష్టంచేశారు. శరద్ పవార్ రాజీనామా నిర్ణయం ప్రకటించిన రోజు కూడా అజిత్ పవార్.. ఆ వేదికపై ఉన్న సంగతి తెలిసిందే.