ATP: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అనంతపురంలో ‘కోటి సంతకాల సేకరణ’ ప్రజా ఉద్యమ కార్యక్రమం ప్రారంభించారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఆయన తొలి సంతకం చేశారు. చంద్రబాబు విజనరీ పేరుతో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌పరం చేస్తున్నారని అన్నారు.