ఢిల్లీలో మళ్లీ వాయు కాలుష్యం మొదలైంది. వాయు నాణ్యత పూర్ కేటగిరీలో నమోదైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 213 పాయింట్లుగా నమోదైంది. గ్రాప్-1 ఆంక్షలు మొదలుపెట్టాలని అధికారులు సూచించారు. కూల్చివేత ప్రదేశాల్లో దుమ్ముపై చర్యలు తీసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను తగలబెట్టకుండా చర్యలు చేపట్టాలన్నారు. కాలుష్య వాహనాలు, డీజిల్ జనరేటర్లు వాడకుండా చూడాలన్నారు.