JGL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సూచనలను పరిగణనలోకి తీసుకుని కథలాపూర్ మండల బీజేపీ నాయకుల నిరసనకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని మంగళవారం బీజేపీ నాయకులు స్వాగతించి హర్షం వ్యక్తం చేశారు. ఎల్లవేళలా హిందువులు, భక్తుల మనోభావాలను కాపాడటమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.