BHPL: జిల్లా కేంద్రంలో బుధవారం జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా.కుమారస్వామి అసోడా మాట్లాడుతూ.. జిల్లాలోని 12 మండలాల్లో ఈనెల 15 నుంచి నవంబర్ 14 వరకు పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 1,32,185 పశువులకు టీకాలు వేసేందుకు 22 బృందాలు ఏర్పాటు చేశామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.