Ramabanam: రామబాణం మూవీ ఫుల్ రివ్యూ..ఇది కూడా పోయినట్టేనా?
లక్ష్యం, లౌక్యం సినిమాల తర్వాత గోపీచంద్, శ్రీవాస్ చేసిన సినిమా 'రామ బాణం'(Ramabanam). ఈ సినిమాను క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించాడు శ్రీవాస్. గోపీచంద్ సరసన ఖిలాడి బ్యూటీ డింపుల్ హయతి హీరోయిన్గా నటించింది. జగపతి బాబు, గోపీ అన్నగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. ఈ నేపథ్యంలో నేడు(మే 5న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? హిట్టా ఫట్టా అనేది ఇప్పుడు చుద్దాం.
సినిమా: రామబాణం నటీనటులు: గోపీచంద్, డింపుల్ హయతీ, జగపతి బాబు, కుష్బూ సుందర్, తరుణ్ రాజ్ అరోరా, నాజర్, శుభలేఖ సుధాకర్, సచిన్ ఖేడేకర్, కాశీ విశ్వనాథ్, అలీ, వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను దర్శకుడు: శ్రీవాస్ నిర్మాతలు: టి జి విశ్వ ప్రసాద్ సంగీత దర్శకుడు: మిక్కీ జె మేయర్ సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిసామి ఎడిటర్: ప్రవీణ్ పూడి విడుదల తేదీ: మే 5, 2023
హీరో గోపీచంద్ చాలా ఏళ్లుగా మంచి హిట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాడు. దాదాపు 10 ఏళ్లుగా పలు సనిమాలు చేస్తున్నా కూడా అతడికి సరైన హిట్ పడలేదు. ఇంతకుముందు, అతను తన అదృష్టంగా నిరూపించుకునే విలన్ పాత్రలను చేసేవాడు. కానీ ప్రస్తుతం లీడ్ యాక్టర్ అయిన తర్వాత అతడికి మరింత ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ఈరోజు(మే 5న) రామబాణం మూవీతో మళ్లీ వచ్చాడు. ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఎలా ఉంది? ఈ చిత్రంతో హిట్టు కొట్టాడా లేదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కథ
విక్కీ (గోపీచంద్) తన సోదరుడు రాజారామ్ (జగపతి బాబు)తో గొడవపడి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. ఏదో ఒక రోజు ధనవంతుడు అవుతానని విక్కీ స్వయంగా చెప్పుకుంటాడు. అతను కోల్‌కతాకు చేరుకుని, అక్కడ పెద్ద డాన్ అవుతాడు. కానీ విక్కీ మాత్రం తన సోదరుడి భావాలు అతని ఫ్యామిలీని ఇష్టపడుతూనే ఉంటాడు. ఆ క్రమంలో తన సోదరుడు ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకుని విక్కీ తిరిగి ఇంటికి వస్తాడు. అయితే తన కుటుంబంతో తిరిగి కలిసిన తర్వాత అతను ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు? అసలు హీరోయిన్ ఎలా పరిచయమైంది? ఆ సమస్యలను వీక్కీ తీర్చాడా లేదా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు అనేదే అసలు స్టోరీ.
ఎలా ఉందంటే
రామబాణం చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించారు. రామబాణం ట్రైలర్ చూసిన ఎవరికైనా వారు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. శ్రీవాస్ తాను వాగ్దానం చేసిన దానిని అందించాడు. ఇది మొదటి ఫ్రేమ్ నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. తెలిసిన కథను అందించడంలో కొత్తదనం లేకపోవడం రామబాణంలో ప్రధానమైన సమస్య. గ్రాండ్ ఇంట్రడక్షన్, నాసిరకం ప్రేమకథ, భారీ ఫ్యామిలీ డ్రామా సెటప్, యాక్షన్ సీన్లు అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. కానీ భావోద్వేగాలు అంతగా అనిపించవు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఫుడ్ సంబంధిత అంశంపై కొనసాగుతుంది. కానీ, స్క్రీన్‌ప్లే మళ్లీ పాత సెటప్ లోకి తీసుకెళుతుంది. ఇదంతా ఒక భారీ క్లైమాక్స్‌కి దారి తీస్తుంది. చివర్లో ఒక సందేశంతో సినిమా ముగిస్తుంది. కానీ మెసేజ్ బాగుంటుంది.
ఎవరెలా చేశారు
రామబాణంలో హీరో గోపిచంద్ మరోసారి గుర్తుండిపోయే యాక్టింగ్ ఇచ్చారు. యాక్షన్, కామెడీ, రొమాన్స్ దాదాపు అన్ని సీన్లలో అదరగొట్టారు. ఇక హీరోయిన్ డింపుల్ హయాతి గ్లామర్ కోసం ప్రధానంగా ఒక సాధారణ కమర్షియల్ హీరోయిన్ పాత్రలో బాగానే నటించింది. పాటల్లో కూడా బాగానే ఉంది. కానీ ఆమెని నటిగా ప్రూవ్ చేసుకునే సీన్లు ఆమెకు లేవనే చెప్పవచ్చు. మరోవైపు అన్న పాత్రలో జగపతి బాబు, కుష్బూ మాతృమూర్తిగా బాగున్నారు. ఇక అలీ, వెన్నెల కిషోర్, సత్య, గెట్ అప్ శీను వంటి చాలా మంది హాస్యనటులు వారి క్యారెక్టర్ల మేరకు నటించారు. దీంతోపాటు నాజర్, శుభలేఖ సుధాకర్, సచిన్ ఖేడేకర్ తదితరుల క్యారెక్టర్లు వృధాగా ఉన్నట్లు అనిపిస్తాయి.
సాంకేతికం
డైరెక్టర్ శ్రీవాస్ పాత కథనంతో కొంచెం కామెడీ యాక్షన్ సీక్వెన్సులతో ఈ చిత్రాన్ని మెళవించినట్లు అనిపిస్తుంది. మిక్కీ జె మేయర్ సంగీతం కొన్నిచోట్ల మిస్ చేశాడనిపిస్తుంది. వెట్రి పళనిసామి విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ నీట్ గా ఉంది. ప్రవీణ్ పూడి ఆఫర్‌పై పూర్తిగా అంచనా వేసినప్పటికీ, సరైన కట్లను అందించి, మూవీ ముందుకు సాగేలా చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు.
ప్లస్ పాయింట్లు:
గోపీచంద్ నటన
ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్లు:
కాలం చెల్లిన కథ
బలహీనమైన ఫస్ట్ హాఫ్
పేలవమైన స్క్రీన్ ప్లే
సంగీతం