KMM: మధిర మండలంలోని అన్ని గ్రామాలలో ఈనెల 15 నుంచి NOV 15 వరకు గాలికుంటు వ్యాధి నివారణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మండల పశు వైద్యాధికారి ఉమా కుమారి తెలిపారు. పాడిపశు రైతులు తమ పశువులకు ఎలాంటి వ్యాధి ప్రబలకుండా ముందస్తుగా గాలికుంటు టీకాలు వేయించాలని సూచించారు. గాలికుంటు టీకాలు వేయించడం వల్ల పశువులకు వ్యాధులు దరిచేరవని పేర్కొన్నారు.