»Interesting Title For Pawan Remake Devude Digi Vachina
Pawan kalyan: పవన్ రీమేక్ కోసం ‘దేవుడే దిగి వచ్చిన’!
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) నాలుగు సినిమాలు చేస్తున్నాడు. హరిహర వీరమల్లుని హోల్డ్‌లో పెట్టి 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజి' సినిమాల షూటింగ్స్ మొదలు పెట్టాడు. అయితే వీటి కంటే ముందే.. రీమేక్ షూటింగ్ ఫినిష్ చేశారు. అయితే ఇంకా ఈ సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు. ఈ క్రమంలో తాజాగా ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది.
‘వినోదయ సీతమ్’ రీమేక్‌ను తమిళ్ వెర్షన్ తెరకెక్కించిన సముద్రఖనినే తెలుగులోను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. హీరోయిన్లుగా కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు. జూలై 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఈ మూవీలో.. పవన్(Pawan kalyan) దేవుడిగా కనిపించబోతున్నాడు.
గోపాల గోపాల తర్వాత పవన్ దేవుడిగా నటిస్తున్న సినిమా ఇదే. ఈ క్రమంలో దేవుడు కలిసొచ్చేలా ఓ టైటిల్‌ను అనుకుంటున్నారట. ఇంతకు ముందు దేవుడు, దేవర అనే టైటిల్స్ వినిపించరగా.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ తెరపైకి వచ్చింది. లేటెస్ట్ అప్టేడ్ ప్రకారం ఈ టైటిల్ దాదాపుగా ఫిక్స్ అయిందనే టాక్ నడుస్తోంది.
‘దేవుడే దిగి వచ్చిన’ అనే టైటిల్ ఖరారు చేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ‘సంతోషం’ సినిమాలో.. దేవుడే దిగి వచ్చిన, స్వర్గమే నాకిచ్చినా.. అంటూ, నాగర్జున ఓ పాట ఉంది. ఇప్పుడు ఆ పాటతో పవన్ సినిమాకు టైటిల్‌గా పెట్టడం విశేషమనే చెప్పాలి.
ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు.. త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. అందుకే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. మరి మెగా మేనల్లుడితో కలిసి పవర్ స్టార్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.