SKLM: నరసన్నపేట మండలం యారబాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎంఈఓ 2 పేడాడ దాలినాయుడు సమక్షంలో ఆరుగురు విద్యార్థులు చేరారు. ఇవాళ ఉదయం స్థానిక పాఠశాలకు చేరుతున్న ఎంఈఓ విద్యార్థులు పాఠశాలలో చేరడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా తల్లిదండ్రులు కృషి చేయాలని పేర్కొన్నారు. హెచ్ఎం శ్రీదేవి పాల్గొన్నారు.