»Vijay Devarakonda Birthday Special Kushi Movie First Lyrical Song Release On May 9th 2023
Vijay Devarakonda: బర్త్ డే స్పెషల్..మే 9న ఖుషీ ఫస్ట్ లిరికల్ సాంగ్
యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), స్టార్ హీరోయిన్ సమంత(samantha) జంటగా నటించిన ‘ఖుషీ(kushi)’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. ఈ క్రమంలో మే 9న విజయ్ బర్త్ డే సందర్భంగా ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించి.. అదే రోజున చిత్రంలోని మొదటి పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ సమంత(samantha) కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ఖుషీ(kushi). బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్ తో సెన్సిబుల్ మూవీ మేకర్ గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ నెల 9న విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అద్భుతంగా ఉంది. విజయ్, సమంత మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలెట్ అనేలా ఆ ఇద్దరి ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇదో స్వచ్ఛమైన మనసుల కథ అని తెలిసేలా చుట్టూ తెల్లని మంచు కొండలు, తెల్లని పావురాల మధ్య మనసంతా స్వేచ్ఛా విహంగంలా మారింది అనేలా విజయ్ సోలో ఫోటో సైతం చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఈ పోస్టర్(poster) చూడగానే ఈ మూవీ ఎంత ప్లెజెంట్ గా ఉంటుందో అని అర్థం చేసుకోవచ్చు.
హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నుంచి ‘ నా రోజా నువ్వే’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్(first lyrical song)ను ఈ నెల 9న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రాబోయే ఈ పాటతో మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెరిగేలా ఈ లిరికల్ సాంగ్ ఉంటుంది. పాన్ ఇండియన్(pan india) ప్రాజెక్ట్ గా తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
మేకప్: బాషా కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్ ఆర్ట్: ఉత్తర కుమార్, చంద్రిక ఫైట్స్: పీటర్ హెయిన్ రచనా సహకారం: నరేష్ బాబు.పి పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా పబ్లిసిటీ : బాబ సాయి మార్కెటింగ్ : ఫస్ట్ షో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్ ఎడిటర్ : ప్రవీణ్ పూడి ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్ సి.ఇ.ఓ : చెర్రీ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జి.మురళి నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి కథ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: శివ నిర్వాణ