పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన వజీర్ మహ్మద్ (95) ఇవాళ కన్నుమూశారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బర్మింగ్‌హామ్‌లో తుదిశ్వాస విడిచారు. వయో భారం కారణంగా వజీర్ మరణించారు. 1952లో భారత్, పాక్ మధ్య జరిగిన తొలి టెస్ట్ సిరీస్‌లో పాల్గొన్న వజీర్, అప్పటి నుంచి 1959 వరకు 20 టెస్టులు ఆడి 801 పరుగులు చేశారు.